వరుసగా రెండోసారి చేస్తున్న ఊర్వశి రౌతేలా!..అంతా బాలయ్య చలువే
on Mar 24, 2025
బాలయ్య లేటెస్ట్ హిట్ 'డాకుమహారాజ్' (Daku Maharaj)లో నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్న భామ ఊర్వశి రౌతేలా.ఈ మూవీ ముందు వరకు 'ఊర్వశి రౌతేలా' అంటే కేవలం ఐటెం సాంగ్స్ కే పరిమితమని భావించేవాళ్లు.తన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది.కానీ ఎప్పుడైతే'డాకు మహారాజ్' లో పోలీసు ఆఫీసర్ గా ప్రాధాన్యత గల పాత్రని పోషించిందో,తనలో మంచి నటి ఉందనే విషయం అందరకి అర్ధమయ్యింది.
'డాకు మహారాజ్ ని అగ్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ తమిళ అగ్ర హీరో సూర్య(Suriya)లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి(Venki Atluri)కాంబోలో ఒక మూవీని నిర్మించబోతోంది.ఇందులో 'ఊర్వశి రౌతేలా' నటించబోతుందనే వార్తలు తమిళ,తెలుగు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.హీరోయిన్ గా కాకపోయినా కూడా కథకి సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో ఊర్వశి కనిపించనుందని అంటున్నారు.ఇదే కనుక జరిగితే సితార బ్యానర్ లో ఊర్వశి వరుసగా రెండోసారి చేసినట్టవుతుంది.సినీ విశ్లేషకులు అయితే సూర్య మూవీలో ఊర్వశి చెయ్యడం ఖాయమైతే కనుక,తమిళ చిత్ర సీమలో ఊర్వశి తన హవాని చూపించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జూన్ లో ఈ ప్రెస్టేజియస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి.ఇందుకు సంబంధించి సూర్య డేట్స్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది.హీరోయిన్ గా మొదట్లో క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించింది.ఆమె బిజీగా ఉన్న దృష్ట్యా మరో హీరోయిన్ 'కయదు లోహర్’(kayadu LOhar)ని ఎంపిక చేశారనే టాక్ వినపడుతుంది.గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో కయదు ఎక్స్ట్రాఆర్డినరీ గా నటించి యూత్ లో మంచి క్రేజ్ ని పొందిన విషయం తెలిసిందే.జీవీ ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించనున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
