రాజ్‌నాథ్ ఆ సినిమాలపై కరుణ చూపుతారా..?
on Oct 20, 2016

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు బాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే యూరీ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో రాజ్‌థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పాక్ నటీనటులను భారత్ విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలన్న హెచ్చరికతో వారంతా భారత్ వదిలి వెళ్లిపోయారు. అలాగే బాలీవుడ్ సినిమాల్లో పాక్ నటీనటులకు అవకాశాలిస్తున్న మహేశ్‌భట్, కరణ్ జోహర్‌లను తరిమి తరిమి కొడతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. అలాగే పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్, మరో పాక్ యాక్టర్ మహిరా ఖాన్ నటించిన రయీస్ వంటి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో దర్శకుడు కరణ్ జోహార్ భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు. సినిమా విడుదలకు సహకరించాలని ఆయన రాజ్‌నాథ్‌ని కోరే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



