అప్పుడు అల్లు అర్జున్‌తో...ఇప్పుడు వరుణ్ తేజ్‌తో!
on Sep 19, 2020
కన్నడ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్న ఉపేంద్ర తాజాగా మరో తెలుగు సినిమాకి సంతకం చేశాడు. మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. చాలా రోజుల తరవాత ఉపేంద్రను స్ట్రయిట్ తెలుగు సినిమాలోకి తీసుకొచ్చిన ఘనత త్రివిక్రమ్ శ్రీనివాస్‌దే. అల్లు అర్జున్‌తో 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర నటించారు. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో నటించనున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కీలక పాత్రలో ఉపేంద్ర నటించనున్నారని కొన్ని రోజుల క్రితమే వినిపించింది. శుక్రవారం కన్నడ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయం వెల్లడించారు. ఉపేంద్రతో కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నానని వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తే.. ఉపేంద్రకి సినిమా యూనిట్ పుట్టినర్జు శుభాకాంక్షలు తెలిపింది.