'మాస్టర్'... మొత్తం మీద ఏడాది లేటు!
on Sep 19, 2020
కార్తీతో 'ఖైదీ' తీసి హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్, ఆ తరవాత తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో విజయ్ హీరోగా సినిమా తీసే అవకాశం అందుకున్నాడు. అందులో విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని ఒప్పించాడు. సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. అదే 'మాస్టర్'. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా. కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో రాలేదు.
హిందీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాకు ఓటీటీలో విడుదల అవుతుండటంతో 'మాస్టర్'ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి చూస్తున్నారనే మాటలు తమిళనాట వినిపించాయి. అప్పుడు ఓటీటీలో సినిమాను విడుదల చేయబోమని, థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ తరవాత దీపావళి లేదా సంక్రాంతికి సినిమా విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో నిర్మాతలు రిస్క్ చేయాలని అనుకోవడం లేదట. ఏకంగా వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. సంక్రాంతికి విడుదల చేస్తే తెలుగులో థియేటర్లు దొరుకుతాయా? లేదా? అనే సందేహాలు కూడా వేసవికి వెళ్ళడానికి కారణమట. మొత్తం మీద అనుకున్న దానికంటే ఏడాది లేటుగా 'మాస్టర్' థియేటర్లలోకి వస్తుందన్నమాట.
Also Read