ఫేమస్ టీవీ నటిని బలి తీసుకున్న కరోనా!
on Dec 7, 2020
ప్రముఖ టెలివిజన్ తార, హిందీ సీరియల్స్ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దివ్య భట్నాగర్ (34) కొవిడ్-19తో బాధపడుతూ నేటి ఉదయం ముంబైలోని సెవన్ హిల్స్ హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. హై బీపీతో బాధపడుతున్న ఆమె పది రోజులుగా కరోనాతో పోరాడుతూ వచ్చారు.
అంతకు ముందు దివ్య పరిస్థితి క్రిటికల్ కావడంతో వెంటిలేటర్ అమర్చినట్లు దివ్య తల్లి చెప్పారు. ఆమె పరిస్థితి క్షీణించడంతో నవంబర్ 26న హాస్పిటల్‌లో చేర్పించారు. న్యుమోనియాతోనూ ఆమె బాధపడ్డారు. "దివ్య ఆరోగ్య స్థితి తెలియడంతో నేను, మా అబ్బాయి ముంబైకి వచ్చాం. తన పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు వెంటిలేటర్‌ను అమర్చారు" అని దివ్య తల్లి తెలిపారు. ఢిల్లీలో కొడుకుతో పాటు ఉంటున్న ఆమె, కూతురి పరిస్థితి తెలియగానే హుటాహుటిన బయలుదేరి ముంబై వచ్చారు.
దివ్య వైవాహిక బంధం చిక్కుల్లో పడటం వల్ల ఆమె బాగా ఒత్తిడి ఎదుర్కొటూ వచ్చిందని కూడా దివ్య వాళ్లమ్మ చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఆమె గగన్ అనే వ్యక్తికి పెళ్లాడారు. పలు రియాలిటీ షోలకు అతను పనిచేశాడు. అయితే గగన్ ఇంటిని విడిచి పెట్టి వెళ్లడంతో దివ్య ఒంటరిగా జీవిస్తున్నారు.
హాస్పిటల్‌లో చేరే ముందు 'తేరా యార్ హూ మై' కామెడీ షో షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చిన దివ్య, యే రిష్తా క్యా కెహ్‌లాతా హై, సంస్కార్, ఉడాన్, జీత్ గయీ తో పియా మోరే, విష్ లాంటి సీరియల్స్ ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.