Trisha : త్రిష వెబ్ సిరీస్ బృందా టీజర్ రిలీజ్ .. ఎలా ఉందంటే!
on Jul 9, 2024
.webp)
త్రిష తెలుగు సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. వర్షం సినిమాలో తన నటనకి విమర్శకుల ప్రశంసలు పొందింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, స్టాలిన్ లాంటి సినిమాలతో మరింతగా పాపులర్ అయింది. ఆ తర్వాత తను కాస్త గ్యాప్ తీసుకుంది.
ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది త్రిష. తను పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ' బృంద '. ఈ సిరీస్ సోనిలివ్ లో అగస్ట్ 2 న రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన టీజర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీలో ఈ సిరీస్ రిలీజ్ అవ్వనుంది. ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు ఇందులో నటించారు. సూర్య వంగల దర్శకత్వం వహించాడు.
టీజర్ ని బట్టి చూస్తే ఎక్కడో ఒక ఊళ్ళో ఇంకా మూఢనమ్మకాలు పాటిస్తూ చేసే దురాచారాలని ఎదుర్కోడానికి త్రిష పోలీస్ ఆఫీసర్ బృంద గా వెళ్తుంది. " మనం ఈ భూమి మీదకి రాకముందు ఎంత చెడు అయిన ఉండొచ్చు కానీ మనం వెళ్ళే ముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్ళాలి బృంద" అంటు సాగే డైలాగ్స్ ఈ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేశాయి. మరి బృంద వాళ్ళని ఎలా ఎదుర్కుంది తను వారికోసం చేయడానికి సిద్ధమైంది అనేది తెలియాలంటే సోనిలివ్ లో అగస్ట్ 2 నుండి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



