The Platform Review : ఆహారం విలువ చెప్పే సినిమా.. ఓటీటీలో మోస్ట్ డిస్టబింగ్ సినిమా!
on Jul 9, 2024
.webp)
మనం రెగ్యులర్ గా ఆహారాన్ని వృధా చేస్తుంటాం. అయితే ఈ సినిమా చూస్తే ఇంకెప్పుడు వృధా చేయరు. అయితే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఎందుకంటే ఈ మూవీలోని కొన్ని సీన్లు అంత డిస్టబ్ గా ఉంటాయి.
ఈ మూవీ పేరు ' ది ప్లాట్ ఫామ్(The Platform). ఈ మూవీ కథేంటంటే.. ఓ గుహాలాంటి గదిలో గోరెంగ్ అనే వ్యక్తి నిద్రలేస్తాడు. అతని గదిలోనే త్రిమగాసి అనే మరొకతను ఉంటాడు. అసలు అతను గుహాలో ఎందుకు ఉన్నాడు? అక్కడ ప్రతీరోజు ఏ జరుగుతుందనేది త్రిమగాసి అనే వ్యక్తి గోరెంగ్ కి వివరిస్తుంటాడు. 333 ఫ్లోర్స్ లో ప్రతీ గదిలో ఇద్దరు చొప్పున ఉంటారు. ప్రతీ ఫ్లోర్ కి ఫుడ్ ఉన్న ఫ్లాట్ ఫామ్ వస్తుంది. రెండు నిమిషాలు మాత్రమే ఫుడ్ ఉన్న ప్లాట్ ఫామ్ ఆగుతుంది. అయితే పై నుండి వస్తుంటే ఆ ఫ్లోర్ లోని వాళ్ళు వాళ్ళకి సరిపడే ఫుడ్ తో పాటు అదనపు ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కింద ఫ్లోర్ లో ఉన్న వారికి ఫుడ్ సరిపోయేది కాదు. అయితే ఒక్కోసారి ఫుడ్ వచ్చేది కాదు. దాంతో వారి గదిలోని మరొకరిని చంపి తింటు ఉంటారు . అలా ఫుడ్ సరిపోక ఆకలి భాదతో పక్కన వాళ్ళని చంపి తింటూ అక్కడివాళ్ళు బ్రతికే వారు. అయితే అసలు ఎవరు వారిని అక్కడ బంధించారు? తనంతట తానుగా వచ్చిన గోరెంగ్ ఎదుర్కొన్న సవాళ్ళేంటి? ఆ జైలు లాంటి గుహ నుండి వాళ్ళు తప్పించుకున్నారా లేదా అనేది మిగతా కథ.
ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని వేల మంది సరైన ఆహారం లభించక చనిపోతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం విచక్షణ కోల్పోయి ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నారు. అలా ఫుడ్ వేస్ట్ చేస్తే అది వారి ప్రాణాల మీదకే వస్తుందంటు చెప్పే మెసెజ్ ' ది ప్లాట్ ఫామ్(The Platform) ఇస్తుంది. ఎంతకావాలో అంతే తినాలి. మిగిలింది లేని వాళ్ళకి ఇవ్వాలంటు.. కొన్ని భయంకరమైన సీన్లతో ఈ మూవీ సాగుతుంది. ఎంతలా అంటే కుళ్ళిమ ఎముకల మధ్య తినడం, మనిషి మాంసాన్ని తినడం లాంటివి చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. డిస్టబింగ్ సీన్లని ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళకి ఈ మూవీ ఓ ఫీస్ట్ అనే చెప్పాలి. అయితే సెన్సిటివ్ గా ఆలోచించేవాళ్ళు దీన్ని చూడకపోవడమే బెటర్. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఓ సారి ట్రై చేయొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



