నితిన్ హీరో.. పవన్ ప్రొడ్యూసర్
on Nov 16, 2016
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకొంటోంది. నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..? పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లు. ఈ దోస్త్‌లిద్దరూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని, సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఎట్టకేలకు నితిన్ సినిమాతో ఈ స్నేహితులిద్దరూ కలసి జాయింట్ వెంచర్ ప్రారంభించారు. నితిన్ అటు త్రివిక్రమ్‌కీ, ఇటు పవన్‌కీ కావల్సిన వాడే. కాబట్టి.. ఈ కాంబో క్రేజ్‌ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ పూజా కార్యక్రమాలకు మీడియానీ దూరంగా పెట్టారు. నితిన్ - కృష్ణ చైతన్య కాంబో ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో చర్చల దశలో ఉంది. ఈ సినిమాని నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై తెరకెక్కించాల్సింది. అయితే ఇప్పుడు ఇది పవన్, త్రివిక్రమ్‌ల చేతికి వచ్చింది. నితిన్ అంటే పవన్‌కి చాలా అభిమానం. దాన్ని చాలా సందర్భాల్లో చాటుకొన్నాడు కూడా. ఇప్పుడు తన అభిమాని కోసం సినిమా తీయడం.. గ్రేటే. సర్‌ప్రైజ్ ప్యాక్‌లా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తాడేమో చూడాలి.