నాగార్జున ఛాన్స్ ఇచ్చినట్టేనా..?
on Aug 15, 2016

ఐతే సినిమాతో చిన్న సినిమాల్లో ఓ విప్లవం తీసుకొచ్చాడు చంద్రశేఖర్ యేలేటి. ఆ సినిమా తరవాత.. చిన్న సినిమాల్ని తీసే విధానంలోనూ, చూసే విధానంలోనూ మార్పు వచ్చింది. అనుకోకుండా ఓరోజు, ప్రయాణం, ఒక్కడున్నాడు, సాహసం... ఈ చిత్రాలన్నీ దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి పనితనానికి అద్దం పట్టాయి. తాజాగా ఆయన నుంచి వచ్చిన మనమంతా కూడా విమర్శకుల మెప్పు పొందింది. తొలిసారి చందూ ఓ స్టార్ హీరోతో కలసి పనిచేసే అవకాశాన్ని తీసుకొచ్చిందా సినిమా. చందూ ప్రస్తుతం నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేశారని, త్వరలోనే నాగార్జునకు వినిపించబోతున్నారని టాక్. నాగ్ కూడా చంద్రశేఖర్ యేలేటితో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నార్ట. అన్నీ కుదిరితే.. ఓం నమో వెంకటేశాయ తరవాత నాగ్ ఈ చిత్రాన్నే పట్టాలెక్కించే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



