అఖిల్‌కి ఇంత కంటే అవమానం ఉంటుందా?
on Aug 15, 2016

అఖిల్ కి ఘోర అవమానం జరిగింది. అదీ.. ఓ కొత్త దర్శకుడి చేతిలో. ఆ దర్శకుడెవరో కాదు. తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు సినిమాకి దర్శకత్వం వహించింది తనే. ఈ ఒక్క సినిమాతో ఆ దర్శకుడి రేంజ్ మారిపోయింది. కథలు వినడానికి నిర్మాతలు, హీరోలు రెడీగా ఉన్నారు. అయితే... పెళ్లి చూపులు సినిమా కంటే ముందు.. ఓ హీరో పిలిచి 'కథుంటే చెప్పు భయ్యా' అని అడిగాడు. కానీ... ''మీకు తగిన కథ నా దగ్గర లేదు'' అని తప్పించుకొన్నాడట. ఆ హీరో ఎవరో కాదు. అఖిల్. తన మొదటి సినిమా కోసం కథల ప్రయత్నాల్లో ఉండగా.. అఖిల్ యూ ట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాడు.
అవి తీసింది తరుణ్ భాస్కర్ అని తెలుసుకొని.. తరుణ్‌ని పిలిపించాడట అఖిల్. 'మనం కలసి సినిమా చేద్దామా' అని ఆఫర్ ఇచ్చాడట. అఖిల్ అప్పటికి ఒక సినిమా చేయకపోయినా.. యూత్‌లో మంచి ఫాలో యింగ్ ఉంది. దానికి తోడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఎవరు వదులుకొంటారు? కానీ తరుణ్ భాస్కర్ మాత్రం.. 'నా దగ్గర కథలేదు' అని తప్పించుకొన్నాడట. లేకపోతే వినాయక్ ప్లేసులో తరుణ్ భాస్కర్ ఉండేవాడు. పెళ్లి చూపులు సినిమా చూశాక అఖిల్ మళ్లీ తరుణ్ ఫ్యానయిపోయాడు. ''తరుణ్ తో సినిమా చేయడానికి నేను ఇప్పటికీ సిద్ధమే'' అంటున్నాడు అఖిల్. కానీ తరుణ్ మాత్రం నోరు మెదపడం లేదు. పాపం అఖిల్...!! నోరు విడచి అడిగినా పట్టించుకోవడం లేదంటే... ఇంతకంటే అవమానం ఏముంది?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



