పాటలకు డాక్టర్ పట్టా అందుకోనున్న చంద్రబోస్!
on Mar 16, 2024
శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ దర్శకత్వంలో డా.డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్‌మహల్’ చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా..’ పాటతో రచయితగా ఇండస్ట్రీలో ప్రవేశించారు చంద్రబోస్. ఈ 30 సంవత్సరాల్లో 800 సినిమాల్లో 3,600కి పైగా పాటలు రాసారు చంద్రబోస్. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు జనంలోకి దూసుకెళ్లాయి. టాలీవుడ్‌లోని అందరు హీరోలకు సూపర్‌హిట్ సాంగ్స్‌ని రాసిన చంద్రబోస్ ఎంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును టాలీవుడ్‌కి అందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ అనే పాటకు ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించిందది.
సినిమా పాటలకు చంద్రబోస్ అందించిన సేవలను గుర్తించి హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంత సాగర్‌లోని ఎస్.ఆర్. విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. శుక్రవారం జరిగే విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో చంద్రబోస్‌కు డాక్టరేట్ పట్టా ప్రదానం చేయనున్నట్టు విశ్వవిద్యాలయం కాన్వకేషన్ కమిటీ చైర్మన్ సి.వి.గురురావు ప్రకటించారు. ఎస్.ఆర్. విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ తన ్ల కెరీర్ జర్నీలో 3600 పైగా పాటలు రాయడం ద్వారా పరిశ్రమలో చెరగని ముద్ర వేసారు. స్నాతకోత్సవంలో డిగ్రీ, డాక్టరేట్ ప్రదానంతో పాటు పూర్వ విద్యార్థులకు పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమం జరపబోతున్నాం’ అని తెలిపారు. ప్రథమ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ అనీల్ డి.సహస్రబుధే.. (ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ షనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్.. ఎన్‌ఏఏసి , బెంగళూరు) ముఖ్య అతిథిగా పాల్గొననుండగా, ప్రొఫెసర్ దీపక్ గార్గ్ (ఎస్.ఆర్. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్), ఏ వరదారెడ్డి, ఎస్.ఆర్. యూనివర్శిటీ ఛాన్సలర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.