‘మిక్స్ అప్’ మూవీ రివ్యూ
on Mar 16, 2024
మూవీ : మిక్స్ అప్
నటీనటులు: కమల్ కామరాజు, అక్షర గౌడ, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జావేరి, బిందు చంద్రమౌళి, కామాక్షీ భాస్కర్ల తదితరులు
కథ: హైమా వర్షిణి
ఎడిటింగ్: సత్య
మ్యూజిక్: కౌశిక్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు
నిర్మాతలు : తిరుమల్ రెడ్డి, అమిరెడ్డి
దర్శకత్వం: ఆకాష్ బిక్కీ
ఓటీటీ : ఆహా
కథ:
ఓ సైకాలజిస్ట్ దగ్గరికి రెండు పెళ్ళైన జంటలు తమ భాదలు చెప్పుకోడానికి వస్తారు. అభయ్ (కమల్ బాలరాజ్), నిక్కీ (అక్షర గౌడ) తమ సంసార జీవితం బాగోలేదని దానికి కారణం అభయ్ తో సెక్స్ లైఫ్ కారణమని చెప్తుంది. మరోవైపు సాహు(ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి(పూజా జావేరి) పెళ్ళి తర్వాత ప్రేమ ఉండాలని.. అదే లేదని మైథిలి డాక్టర్ పద్మావతి( బిందు చంద్రమౌళి) కి చెప్తుంది. ఇలా రెండు జంటలు వేరు వేరు సెషన్స్ లో తమ మ్యారేజ్ లైఫ్ లోని సమస్యలని, వాదోపవాదాలని వినిపిస్తారు. ఇక ఇద్దరి వాదనలు విన్న సైకాలజిస్ట్ విడిపోవాలనే నిర్ణయం తీసుకోవద్దని ఎక్కడికైనా టూర్ కి కలిసి వెళ్ళండి అని సలహా ఇస్తుంది. డాక్టర్ సలహాతో రెండు జంటలు గోవాకి వెళ్తాయి. ఇక గోవాలో సాహు, నిక్కీలకి ఫ్రెండ్ అయిన రీతు కలుస్తుంది. అసలు ఆ రెండు జంటల మధ్య గల సమస్యలేంటి? వారు కలిసి ఉండగలిగారా? రీతు పాత్రేంటి అనేది తెలియాలంటే మిక్స్ అప్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రతీ ఒక్కరి లైఫ్ లో పెళ్ళి తర్వాత చాలా మార్పులు వస్తాయి. పూర్వకాలంలో పెళ్ళి తర్వాత సెక్స్ లైఫ్ బాగున్నా బాలేకపోయిన పెద్దలకు, సమాజానికి బయపడి అడ్జెస్ట్ అయి కలిసి ఉంటారు. కానీ ప్రస్తుతం అలా ఎవరు ఆలోచించట్లేదని చెప్తూ ఆరంభించిన సీన్ తో కాస్త ఆసక్తిని రేకెత్తించారు. అయితే మొదట పది నిమిషాల్లోనే వారి వైవాహిక జీవితంలో సెక్స్ గురించి ప్రస్తావన రావడంతో కథలో బోల్డ్ అండ్ అడల్డ్ సీన్స్ మొదలవుతాయి. దీంతో ఫ్యామిలీతో చూడలేము.
ఇక వారి సమస్యలను పదే పదే చెప్తూ అదేపనిగా బోల్డ్ సీన్లు వస్తూనే ఉంటాయి. నిడివి గంటన్నరే అయిన అందులో సగానికి పైగా సీన్లని స్లోగా సాగుతుంటాయి. అందులోనూ నాలుగు పాత్రలే ఉండటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కంటెంట్ ఎంత బాగున్నా నాలుగు క్యారెక్టర్లతోనే సాగదీయడం చూడటానికి కాస్త కష్టంగా ఉంటుంది. పైగా రిపీటెడ్ డైలాగ్స్, రిపీటెడ్ సీన్స్ ని చూస్తున్నామనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
గోవా ట్రిప్ లో కరెక్ట్ పార్టనర్ ని కలిసారని చెప్తూ తీసిన సీన్లని ముందుగానే ఊహించెయొచ్చు. ప్రతీది గెస్ చేసేలా ఉంటుంది ఊహించని ట్విస్ట్ లు పెద్దగా ఏమీ లేవు. పైగా క్లైమాక్స్ మరీ సాధారణంగా ఉంది. ఏదైన మాట్లాడితే బెడ్ రూమ్ సీన్సే కనిపిస్తాయి. మనం ట్రైలర్ లో ఏదైతో చూస్తామో అదే మూవీ మొత్తం ఉంటుంది. కొత్తగా ఏమీ ఉండదు. పెళ్ళి తర్వాత వేరొక పార్టనర్ ని చూసుకోవాలని చెప్పడం లాజిక్ లెస్ గా ఉంటుంది. ఏదీ పర్ఫెక్ట్ గా ఉండదని డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు. కానీ కథలో గందరగోళం నెలకొంది. ప్రేక్షకుడికి వహ్వా అనిపించే సీను ఒక్కటి లేదు. యూత్ కోసం మాత్రమే ఈ సినిమాని తీసినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని సీన్లు చాలానే ఉన్నాయి. కౌశిక్ మ్యూజిక్ బాగుంది. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సత్య ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అభయ్ పాత్రలో కమల్ బాలరాజ్ ఆకట్టున్నాడు. నిక్కీ పాత్రలో అక్షర గౌడ, మైథిలిగా పూజా జావేరి, సాహుగా ఆదర్శ్ బాలకృష్ణ బాగా చేశారు. డాక్టర్ పద్మావతిగా బిందు చంద్రమౌళి పర్వాలేదనిపించింది. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా... ఓన్లీ యూత్ కోసం మాత్రమే ఈ సినిమా..ఫ్యామిలీతో చూడలేని కథ ఇది.
✍️. దాసరి మల్లేశ్
Also Read