Home

»

Latest News

బాల‌య్య - బోయపాటి హ్యాట్రిక్ లో స్పెషాలిటీ అదే!

Dec 3, 2021 12:06PM

బాక్సాఫీస్ కి పూన‌కాలు తెచ్చే కాంబినేష‌న్స్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను జోడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తీసారి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టే ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు  మూడు సినిమాలు రాగా.. అవ‌న్నీ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. `సింహా` (2010), `లెజెండ్` (2014), `అఖండ‌` (2021).. ఇలా బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ మూడు ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాస్ కూడా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఈ ఇద్ద‌రినీ.. హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `సింహా`, `లెజెండ్`, `అఖండ‌` - ఈ మూడు చిత్రాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశారు. `సింహా`లో డాక్ట‌ర్ న‌ర‌సింహా, శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌.. `లెజెండ్`లో జ‌య‌దేవ్ (లెజెండ్), కృష్ణ‌.. `అఖండ‌`లో ముర‌ళీకృష్ణ‌, అఖండ‌.. ఇలా రెండేసి పాత్ర‌ల్లో క‌నిపించారు బాల‌కృష్ణ‌. ఒక డైరెక్ట‌ర్ ఒక‌ స్టార్ తో చేసిన తొలి మూడు సినిమాల్లోనూ క‌థానాయ‌కుడు డ్యూయెల్ రోల్స్ లో క‌నిపించ‌డం అరుద‌నే చెప్పాలి. అలా.. డ్యూయెల్ రోల్స్ తోనే మూడు వ‌రుస విజ‌యాలతో అరుదైన హ్యాట్రిక్ కొట్టి బాల‌య్య - బోయ‌పాటి కాంబో స‌మ్ థింగ్ స్పెష‌ల్ అనిపించుకోవ‌డం విశేషం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com