ఓ వైపు చిరంజీవి.. మరోవైపు కొత్త సినిమాలు, సిరీస్ లు.. ఈవారం మెగా ట్రీట్!
on Nov 18, 2025

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సినిమాలు, సిరీస్ ల సందడి బాగానే ఉంది. గత వారం 'శివ' రీ-రిలీజ్ తో నాగార్జున అలరిస్తే.. ఈ వారం 'కొదమసింహం' రీ-రిలీజ్ తో చిరంజీవి అలరించనున్నారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి కౌబాయ్ గా నటించిన 'కొదమసింహం' ఈ నవంబర్ 21న మరోసారి థియేటర్లలో వినోదాన్ని పంచనుంది.
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల తాకిడి బాగానే ఉంది. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లరి నరేష్ ఈ 21న '12A రైల్వే కాలనీ' అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 'లిటిల్ హార్ట్స్' హిట్ తో జోష్ లో ఉన్న ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ నుంచి రా లవ్ స్టోరీగా 'రాజు వెడ్స్ రాంబాయి' వస్తోంది. ప్రియదర్శి 'ప్రేమంటే', రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో పాటు.. అర్జున్ నటించిన డబ్బింగ్ ఫిల్మ్ 'మఫ్టీ పోలీస్' కూడా ఈ వారం థియేటర్లలో అడుగుపెట్టనుంది.
రీ-రిలీజ్, రిలీజ్ లతో థియేటర్లు కళకళలాడినట్టుగానే.. సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ కూడా కళకళలాడనుంది.
అమెజాన్ ప్రైమ్:
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 - నవంబర్ 21
నెట్ ఫ్లిక్స్:
బైసన్ మూవీ - నవంబర్ 21
హోమ్‌బౌండ్ హిందీ మూవీ - నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ - నవంబర్ 21
ట్రైన్ డ్రీమ్స్ ఇంగ్లీష్ మూవీ - నవంబర్ 21
జియో హాట్ స్టార్:
ది రోజెస్ ఇంగ్లీష్ మూవీ - నవంబర్ 20
నాడు సెంటర్ తమిళ వెబ్ సిరీస్ - నవంబర్ 20
జిద్దీ ఇష్క్ హిందీ సిరీస్ - నవంబర్ 21
జీ5:
ది బెంగాల్ ఫైల్స్ మూవీ - నవంబర్ 21
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



