రష్మిక ఎంత చక్కని గర్ల్ ఫ్రెండో చెప్పేసిన విజయ్ దేవరకొండ
on Apr 5, 2025
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika)అప్ కమింగ్ చిత్రాల్లో 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend)కూడా ఒకటి.ఫస్ట్ టైం రష్మిక ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కబోతుండంతో గర్ల్ ఫ్రెండ్ పై ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు రష్మిక లుక్ మూవీపై ఆసక్తిని పెంచాయి ఈ రోజు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా' రేయి లోలోతుల' అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
బ్యూటిఫుల్ లవ్ వర్డ్స్ తో నిండి ఉన్న ఈ సాంగ్ కి 'అందాల రాక్షసి' ఫేమ్ 'రాకేందుమౌళి' సాహిత్యాన్ని అందించగా హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)సమంత ల ఖుషి వంటి చిత్రాలకి అద్భుతమైన సంగీతాన్ని అందించి మెస్మరైజ్ చేసిన'హేషం అబ్దుల్ వహబ్' సంగీతాన్ని అందించడం జరిగింది.ఈ సాంగ్ కి ముందు వచ్చే అందమైన ప్రేమ వ్యాక్యాలకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ని ఇచ్చాడు.దేవరకొండ వాటిని పలికిన తీరు మ్యూజిక్ లవర్స్ కి సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.విజయ్ దేవరకొండ,రష్మిక ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈ విషయాన్నీ ఆ ఇద్దరు డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఎన్నో సందర్భాల్లో హింట్ ఇస్తునే వస్తున్నారు.ఈ నేపథ్యంలో దేవరకొండ నోటి నుండి వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' లవ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పూర్తి పాటని 'హేషం అబ్దుల్ వహబ్(Hesham Abdul Wahab)స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించారు.టోటల్ సాంగ్ ని వింటుంటే ప్రేమికుల యొక్క అంతరాలంలో చిక్కుకున్న ప్రేమ పొరలు పొరలుగా ఎలా బయటకి వస్తుందో ఈ సాంగ్ లో చెప్పారు.అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తుండగా దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు.ఒకప్పటి హీరో,నటుడు,చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ ని తెరకెక్కిస్తుండగా తెలుగుతో పాటు హిందీ,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లోను సాంగ్ రిలీజ్ అయ్యింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
