ENGLISH | TELUGU  

అమితాబ్‌తో పూజ.. క‌ల నిజ‌మైన వేళ‌!

on Nov 23, 2021

 

అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే ఒక షూటింగ్‌లో పాల్గొంది. సెట్స్‌పై ఆయ‌న‌తో క‌లిసున్న ఒక ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె ఆ క్ష‌ణాల‌ను త‌న 'క‌ల నిజ‌మైన వేళ‌'గా పేర్కొంది. అమితాబ్ స‌ర‌స‌న చైర్‌లో కూర్చొని హాయిగా న‌వ్వుతున్న పూజ‌, ఆ ఫొటోకు “The man. The legend. ఆయ‌న‌తో షూటింగ్ చేయ‌డం ఒక క‌ల‌. ఎట్ట‌కేల‌కు నా డ్రీమ్ లిస్ట్‌లో దానికి టిక్ కొట్ట‌గ‌లిగాను. త‌గినంత చెప్పేశాను. మ‌రింత తెలుసుకోవ‌డానికి ఎదురుచూస్తుండండి." అని రాసుకొచ్చింది. 

అమితాబ్‌తో ఏ షూటింగ్‌లో త‌ను పాల్గొన్న‌దనే విష‌యం పూజ వెల్ల‌డించ‌లేదు. మ‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కూ ఆ ఇద్ద‌రూ క‌లిసి ఏ సినిమా చేయ‌ట్లేదు. బ‌హుశా ఏదైనా యాడ్ షూట్ అని ఊహించ‌వ‌చ్చు. 

ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ మార్క్‌ను అందుకున్న పూజ‌, ఆ మైల్‌స్టోన్‌ను సాధించిన సంద‌ర్భంగా ఒక స్పెష‌ల్ వీడియోను షేర్ చేసుకుంది. ప‌ని విష‌యానికి వ‌స్తే.. ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో య‌మ‌జోరు మీద ఉందామె. వాటిలో ముందుగా ప్ర‌భాస్ స‌ర‌స‌న తొలిసారి న‌టించిన 'రాధే శ్యామ్' మూవీ 2022 జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతోంది. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ జోడీగా న‌టించిన 'ఆచార్య' మూవీ ఫిబ్ర‌వ‌రి 4న రిలీజ్ కానున్న‌ది. బాలీవుడ్‌లో ర‌ణ‌వీర్ సింగ్‌తో 'స‌ర్క‌స్‌', స‌ల్మాన్ ఖాన్‌తో 'భాయిజాన్', త‌మిళంలో విజ‌య్ స‌ర‌స‌న 'బీస్ట్‌' సినిమాలు చేస్తోంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.