Home

»

Latest News

తమిళనాట వెర్రి అభిమానం.. దేవుళ్ల పక్కన విజయ్ విగ్రహం.. నెటిజన్లు ఫైర్!

Jun 3, 2026 12:40PM

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ, ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన దళపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా.. తమ ఇంటి సభ్యుడిగా, దైవంగా భావించే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఒక వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే వ్యక్తి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. విజయ్ పై ఉన్న అమితమైన ప్రేమతో ఆయన తన ఇంట్లోని పూజగదిలోనే దళపతి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిత్యం దేవుళ్లతో పాటు విజయ్ విగ్రహానికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ, కర్పూర హారతి ఇస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

సాధారణంగా తమిళనాట సినిమా హీరోలను, నటీమణులను అమితంగా ఆరాధించడం కొత్తేమీ కాదు. గతంలో సీనియర్ నటి ఖుష్బూ, గ్లామర్ క్వీన్ నమితలకు అక్కడి అభిమానులు ఏకంగా ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా దివంగత నేత ఎంజీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి లెజెండరీ నటులకు కూడా గుళ్లు కట్టిన చరిత్ర తమిళనాడుకు ఉంది. ఇప్పుడు అదే బాటలో విజయ్ కూడా చేరిపోయారు.

అయితే పూజగదిలో విజయ్ విగ్రహం పెట్టి హారతి ఇవ్వడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి 'మా దళపతి క్రేజ్ అలాంటిది' అంటూ కాలర్ ఎగరేస్తుంటే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ, మనుషులను తెచ్చి దేవుడి గదిలో పెట్టడం ఏంటని, ఇలాంటి వెర్రి అభిమానం సమాజానికి మంచిది కాదని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వైరల్ వీడియో మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే చర్చకు దారితీస్తోంది.

?s=20

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com