Home

»

Latest News

విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.!

Aug 7, 2026 5:47PM

గత కొన్ని నెలలుగా కోలీవుడ్ మీడియాలోనే కాకుండా, సౌత్ ఇండియా పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిన ఆ బిగ్గెస్ట్ కాంట్రవర్సీకి ఈరోజుతో ఫుల్ స్టాప్ పడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, తమిళనాడు సీఎం దళపతి విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత గతంలో చెన్నై కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్ పొలిటికల్ కెరీర్‌కు, ఆయన అభిమానులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారింది.

విజయ్, సంగీత 1999 లో వివాహబంధంతో ఒకటయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కోలీవుడ్ ఆదర్శ దంపతులుగా పేరుతెచ్చుకున్న ఈ జోడీ మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయనే వార్తలు జోరుగా వినిపించాయి. ప్రత్యేకించి విజయ్ పూర్తిస్థాయి రాజకీయంలోకి అడుగుపెట్టి 'తమిళగ వెట్రి కళగం' పార్టీని స్థాపించిన తర్వాత, వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. ఆ తర్వాత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం, అది మీడియాలో వైరల్ కావడం అందరికీ తెలిసిందే.

 

 

Thalapathy Vijay, Divorce Case, Sangeetha

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com