రజనీ, కమల్ ప్రాజెక్ట్ కి ఊహించని దర్శకుడు.. కన్ఫార్మ్ చేసిన కమల్ హాసన్
on Jan 3, 2026

-సుందర్ తప్పుకోవడంతో అందరు షాక్
-మరి దర్శకుడిగా ఎవరు వస్తారని అభిమానుల్లో చర్చ
-కొత్త దర్శకుడిని ప్రకటించిన కమల్ హాసన్
-ఆ దర్శకుడికే ఎందుకు ఇచ్చారు.
-ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు
సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కే కొన్ని కాంబినేషన్స్ ని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు మురిసిపోతుంటారు. కానీ సిల్వర్ స్క్రీన్ మురిసిపోయే కాంబినేషన్ కూడా ఒకటనేది ఉంటుందని నిరూపిస్తున్న కాంబో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)కాంబో. రజనీ కాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ ప్రాజెక్ట్ ఇంటర్ నేషనల్ ప్రాజెక్ట్ గా కీర్తిని గడించింది. దీంతో కథ,కథనాలు ఏ విధంగా ఉంటాయి, డైరెక్టర్ గా ఎవరు ఉంటారు అనే ఆసక్తి కూడా అందరిలో ఏర్పడింది.
ఈ మేరకు రజనీతో గతంలో అరుణాచలం వంటి హిట్ ని తెరకెక్కించిన సుందర్ ని దర్శకుడిగా ఎంపిక చేసారు. కానీ కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని సుందర్ స్వయంగా ప్రకటించాడు. ఆ సందర్భంగా విడుదల చేసిన లేఖలో రజనీ, కమల్ వంటి లెజండ్రిస్ పర్సన్స్ కి సబ్జెట్ పరంగా న్యాయం చేయలేనేమో అని చెప్పడం జరిగింది. దీంతో ఎవరు దర్శకుడిగా వస్తారనే చర్చ ఇండియన్ సినీ ప్రేమికుల్లో నిత్యం తిరుగుతూనే ఉంది. రీసెంట్ గా తమ సినిమాకి 'సిబి చక్రవర్తి'(Cibi Chakravarthy)ని డైరెక్టర్ గా ఫిక్స్ చేసినట్టు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్ నేషనల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేసింది. సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి అని కూడా ప్రకటించడం విశేషం.
Also read: టబు కూతురు ఎవరో తెలిసింది. మరి టబుకి పెళ్లి కాలేదు కదా
సిబి చక్రవర్తి విషయానికి వస్తే 2022 లో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన 'డాన్'(Don)తో దర్శకుడిగా తెరంగ్రేటం చేసాడు. శివ కార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు సిబి చక్రవర్తి కథ, కథనాలకి, టేకింగ్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకే రజనీ, కమల్ ప్రాజెక్ట్ ని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రజనీ నుంచి వస్తున్న 173 వ చిత్రం కాగా షూటింగ్ కి త్వరలోనే వెళ్లనుంది. అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



