బెస్ట్ షార్ట్ ఫిలిం కనిపించలేదు
on Sep 25, 2014
యువ దర్శకులు, నటీనటులకు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ‘తెలుగువన్’ గత కొంతకాలంగా ప్రతి నెలా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘తెలుగువన్’ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. మంచి క్వాలిటీతో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి బహుమతులు అందుకున్నారు. ‘తెలుగువన్’ ద్వారా వారి ప్రతిభ ప్రజలకు, సినిమా పరిశ్రమకు చేరువైంది. గత నెలలో.. అంటే ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ‘తెలుగువన్’ ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కోసం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ‘తెలుగువన్’ పరిశీలనకు వచ్చాయి. అయితే మాకు అందిన షార్ట్ ఫిలిమ్స్ లో బహుమతికి అర్హమైన షార్ట్ ఫిలిం ఒక్కటి కూడా కనిపించకపోవడం మాకు ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగించింది. మాకు అందిన షార్ట్ ఫిలిమ్స్ రాశి బాగుంది. కానీ వాసి తగ్గింది. అందుకే ఈ నెల షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఏ షార్ట్ ఫిలిమ్‌కీ బహుమతిని ఇవ్వలేకపోతున్నాం. అయితే ఉత్తమ షార్ట్ పిలిమ్స్ కోసం ‘తెలుగువన్’ విండోస్ ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఈ నెలలో మాకు మంచి షార్ట్ ఫిలిమ్స్ అందుతాయని ఆశిస్తున్నాం. ఆశావాదంతో ఆహ్వానిస్తున్నాం.