గోపీచంద్ 'లౌక్యం'తో 'లక్ష్యం' చేరుతాడా..!
on Sep 25, 2014
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'లౌక్యం'. 'లక్ష్యం' తర్వాత శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా ఇది. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న గోపీచంద్ కి ఈ సినిమా తప్పక విజయాన్ని అందిస్తుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రొటీన్ మాస్ సినిమాలాగా కాకుండా ఓ మంచి కథను ఈ సినిమాను గోపీమోహన్, కోనవెంకట్ అందిచారట. అలాగే బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమాను చూసిన యూనిట్ సభ్యుల్లో ఒకరైన గోపిమోహన్ గారు తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో సినిమా గురించి చెపుతూ "'లౌక్యం' ఫస్ట్ కాపీ చూశాను, ఈ సినిమా గోపిచంద్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది" అని తెలిపారు.