వరద బాధితులకు అండగా టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్!
on Sep 15, 2024
భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు టెలివిజన్ డిజిటల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తమ సాయం అందించడానికి ముందుకు వచ్చింది. టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఈటీవీ ప్రభాకర్, వినోద్ బాల, ప్రసాద్ తదితరలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసి వరద బాధితుల కోసం రూ.5 లక్షల విరాళం చెక్కులను అందజేశారు. ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న ప్రొడ్యూసర్స్ కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.
Also Read