మళ్ళీ వార్ కి దిగుతున్న చిరు, బాలయ్య!
on Sep 15, 2024
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మధ్య బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి ఈ ఇద్దరూ తలబడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇప్పటికే పదిసార్లు నువ్వా నేనా అన్నట్టుగా పొంగల్ వార్ కి దిగారు. ఇప్పుడు పదకొండవసారి సంక్రాంతి సమరానికి సై అంటున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే వచ్చే సంక్రాంతి సీజన్ పై బాలయ్య కూడా కర్చీఫ్ వేస్తున్నాడు.
బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా బాలయ్య కొద్దిరోజులు బ్రేక్ తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారట. జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. (NBK 109)
చివరగా 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహారెడ్డి' బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ ఫైట్ లో 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ గా నిలవగా, 'వీరసింహారెడ్డి' సూపర్ హిట్ అనిపించుకుంది. మరి ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Also Read