దిల్‌సే షార్ట్‌ఫిల్మ్‌ని మెచ్చుకున్న మేయర్ బొంతు
on Feb 9, 2017

యాంకరింగ్ అంటే అమ్మాయిలు మాత్రమే చేయగలరు అంటూ ముద్ర పడిన యాంకరింగ్ రంగంలో అబ్బాయిలు కూడా తక్కువ తినలేదని నిరూపించాడు రవి. పర్ఫెక్ట్ కామెడి టైమింగ్, అల్లరితో బుల్లితెరపై యాంకర్ గా దూసుకెళ్తున్నాడు రవి. యాంకరింగ్ ఒక్కటే కాదు తనలో మరో టాలెంట్ కూడా ఉందని నిరూపించాడు రవి. రీసెంట్ గా దిల్ సే అనే షార్ట్ ఫిల్మ్ లో రవి యాక్ట్ చేశాడు. దేశభక్తిని చాటుతూ..స్వచ్ఛభారత్ ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ లో రవి చాలా ఛార్మింగ్ గా కనిపించడంతో పాటు తనలో నటుడు కూడా ఉన్నాడని నిరూపించాడు. ఇవాళ ఈ షార్ట్‌ఫిల్మ్‌ని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ వీక్షించారు. అనంతరం మాట్లాడిన ఆయన స్వచ్ఛ్‌భారత్ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఈ షార్ట్‌ఫిల్మ్ ఉపకరిస్తుందని..రవి బాగా నటించాడని ప్రశంసించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



