అంజలి-జై లవ్ ఎఫైర్ కన్ఫర్మ్..ఈ దోశే సాక్ష్యం
on Feb 9, 2017
.jpg)
కొన్ని నిజాలు దాచాలనుకున్నా దాలచలేము..అవి ఎప్పుడైనా బయటపడక తప్పదు. తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోందంటూ ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ తమ మధ్య వున్నది జస్ట్ ఫ్రెండ్‌షిప్పేనని తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య ఇచ్చిన దోశ ఛాలెంజ్‌తో అంజలి-జైల యవ్వారం వెలుగులోకి వచ్చింది.
సూర్య ఛాలెంజ్‌ని స్వీకరించిన జై ఏకంగా అంజలితో కలిసి దోశలు వేస్తూ ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇందులో సూర్య పెట్టిన కండిషన్ ఏంటంటే..అమ్మ లేదా శ్రీమతి కోసం వంటవాళ్లుగా మారాలి..అంజలి, జైకి తల్లి కాదు కనుక ఏం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. జై ఈ కండిషన్ తెలియక సవాల్ స్వీకరించాడా లేక తమ విషయం బయటకు చెప్పాలనే ఇలా చేశాడా అని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



