ENGLISH | TELUGU  

నాలుగు షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు థాంక్స్.. ఇంకా చాలా సమస్యలున్నాయి!

on Oct 14, 2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లలో నాలుగు షోలతో పాటు వంద శాతం ఆక్యూపెన్సీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ సందర్బంగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంతో పాటు నాలుగు షోలకు పర్మిషన్, వందశాతం సీటింగ్ ఆక్యుపెన్సీ లాంటి పలు విషయాల గురించి ఏపీ మంత్రి పేర్ని నానితో తెలుగు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు ఇటీవల చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లోని సమస్యలపై సీఎం జగన్‌ తో చర్చించిన మంత్రి పేర్ని నాని పలు సమస్యలపై స్పందించారు. ముఖ్యంగా నాలుగు షోలకు, అలాగే ఫుల్ ఆక్యుపెన్సీ లాంటి అంశాలకు పర్మిషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, నిర్మాత భరత్ చౌదరి, నిర్మాత ముత్యాల రాందాస్ పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో థియటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ పెంచినందుకు, అలాగే నాలుగు షో లకు పర్మిషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి, ఎఫ్.డి.సి చైర్మన్ విజయ్ చందర్ గారు, ఎఫ్.డి.సి ఎండీ విజయ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, త్వరలోనే వాటి గురించి కూడా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. 

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారు, పేర్ని నాని గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇలా అందరు ఈ సమస్యను అర్థం చేసుకుని సినిమాలకు నాలుగో షో కి పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వంలో ఎవరుంటే వారికి మా సమస్యలను చెప్పుకుంటాం.. వారివల్ల మా సమస్యలను పరిష్కరించుకుంటాం. మాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ అందులో కొన్ని సమస్యలను ఏపీ ప్రభుత్వం తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక థియేటర్స్ టికెట్ విషయం లో కూడా ప్రభుత్వం మా సమస్యను పరిస్కరిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. 

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో నాలుగు షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు, అలాగే థియటర్స్ లో వందశాతం ఆక్యుపెన్సీ పెంచినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినిమా ఇండస్ట్రీ లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిలో ఒక్కొక్కొటిగా ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాల సహకారాలు తెలుగు ఇండస్ట్రీకి కావాలని అన్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.