ఈ దర్శకుల సినిమా అంటే.. అంటే అవి కంపల్సరీ !
on Oct 31, 2017
దర్శకులలో కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయ్. అవేంటో ఒకసారి లుక్కేద్దాం.
కె. విశ్వనాథ్ - ఈయన సినిమా తీసేటప్పుడు సెట్ లో ఖాకీ బట్టలే వేసుకుంటాడు. కళాత్మకత విలువలు లేకుండా సినిమా తీయరు.
కె.రాఘవేంద్రరావు - ఈయన సినిమా మొదలైదగ్గర్నుంచీ పూర్తయ్యేవరకూ గడ్డం తీయరు. ఆ తర్వాత తిరుపతి వెళ్లి వస్తారు. తెరపై పళ్ల మార్కెట్ తప్పనిసరి
దాసరి నారాయణరావు - దాసరి డ్రస్ కోడ్ వైట్ అండ్ వైట్.
వంశీ - గోదావరి లేకుండా వంశీ సినిమా ఉండదు.కనీసం ఒక పాటలో అయినా గోదారి కనిపించాల్సిందే.
కృష్ణవంశీ - తన సినిమా అంటే స్క్రీన్ నిండా జనాలుండాలి. ఇదొక వింత సెంటిమెంట్.
రాజమౌళి- మొదట్టో మామూలుగానే ఉండేవాడు కానీ... ‘మగధీర’ నుంచి అనుకుంట.. తన సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో.. అదే గెటప్ లో కనిపించటం మొదలుపెట్టాడు.
బి.గోపాల్ - తన ప్రతి సినిమాలో కచ్చితంగా ఒక రైల్ ఎపిసోడ్ ఉండేలా చూసుకుంటాడు.
పూరీజగన్నాథ్ - ప్రతి కథనూ గోవా వెళ్లి రాసుకొస్తాడు. అదో సెంటిమెంట్. కనీసం ఒక పాటైనా అక్కడ తీస్తాడు. తీయని సినిమాలు చాలా రేర్.
క్రిష్ - ఏదో ఒక సామాజిక సమస్య లేకుండా కథ ఎంచుకోడు.. సినిమా తీయడు.
శేఖర్ కమ్ముల - తొలి సినిమా నుంచి మొన్నొచ్చిన ‘ఫిదా’ వరకూ ప్రతి సినిమాలో తెరపై వాన కురవాల్సిందే.
సుకుమార్ - ప్రతి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఎందుకో పాపం.. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో మాత్రం పెట్టలేదు.
అనిల్ రావిపూడి - ఈ అబ్బాయ్ కొత్తకుర్రాడే కానీ.. తీసిన మూడు సినిమాల్లోనూ ఓ సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు. తన సినిమాల్లో ఎక్కడో ఒకచోట దివ్యాంగులు కనిపించాల్సిందే. తొలి సినిమా ‘పటాస్’ కథ ఓ మూగ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. రెండో సినిమా ‘సుప్రీమ్’లో పోలియో సోకిన దివ్యాంగులతో ఓ భారీ పోరాట సన్నివేశమే పెట్టాడు. రీసెంట్ గా వచ్చిన ‘రాజా ది గ్రేట్’లో హీరోనే కళ్లు లేనివాడిని చేశాడు. బహుశా అది ఈతగాడి సెంటిమెంట్ కామోసు.