బిగ్గెస్ట్ హిట్స్ @ 2015
on Dec 23, 2015
చిత్రసీమలో విజయాల వాటా ఎప్పుడూ పదిశాతమే! వంద సినిమాలొస్తే.. అందులో హిట్టు అనిపించుకొనేవి పది మాత్రమే! ఈయేటి ఫలితాల సరళి గమనించినా ఇలానే సాగింది. ఇప్పటి వరకూ... దాదాపుగా 170 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్లు చూస్తే 19 మాత్రమే కనిపించాయి. కనీసం ఓ అరడజను యావరేజులుగా మిగిలాయి.
.jpg)
* భళా బాహుబలి
సూపర్ హిట్ బ్లాక్ బ్లస్టర్ బొనాంజా బాహుబలి రూపంలో దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా రూ.550 కోట్లు వసూలు చేయగలిగింది. తెలుగు చలన చిత్రసీమ కనీవినీ ఎరుగని వసూళ్లు ఇవీ.. 80 యేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇదో అద్భుతమైన విజయం. బాహుబలి హవా తెలుగునాట మాత్రమే కాదు.. తమిళ సీమలోనూ కనిపించింది. హిందీలో వంద కోట్లు సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది. ఇంత కంటే..బిగ్గెస్ట్ హిట్ ఏముంటుందిక??
.jpg)
* శ్రీమంతుడి జోరు
బాహుబలి రికార్డులతో పోలిస్తే... మిగిలిన తెలుగు సినిమాలన్నీ చాలా తక్కువగానే కనిపిస్తాయ్. కానీ.. వాటినీ తక్కువ అంచనా వేయకూడదు. బాహుబలి తరవాత వచ్చిన శ్రీమంతుడు దాదాపుగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టాప్ 2గా నిలిచింది. మహేష్ చిత్రాల్లో వంద కోట్లు సాధించిన తొలి చిత్రమిది. వసూళ్లలో టాప్ 2 తెలుగు చిత్రం. ఒక యేడాదిలో ఈ రెండు చిత్రాలతో దాదాపు రూ.700 కోట్ల వసూళ్లు దక్కాయంటే..తెలుగు సినిమా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం అవుతోంది.
.jpg)
* భలే భలే లాభాలోయ్
చిన్న సినిమాల్లో సునామీ లాంటి వసూళ్లు సాధించిన చిత్రం భలే భలే మగాడివోయ్. రూ.8 కోట్లతో తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.35 కోట్లు వచ్చాయి. అంటే నాలుగు రెట్లు లాభాలన్నమాట. బాహుబలి లాభాల శాతంతో పోలిస్తే.. భలే భలే మగాడివోయ్‌కే ఎక్కు వ దక్కినట్టు. ఓవర్సీస్‌లో ఈ సినిమా దుమ్ముదులిపింది. మహేష్ బాబు సినిమాకి ఎన్ని వసూళ్లు వస్తాయో.. అన్ని వసూళ్లు ఈ సినిమాకి దక్కాయి. మారుతికి తనపై పడిన బూతు ముద్ర ఈ సినిమా తొలగించింది. నానిని స్టార్ ని చేసింది.
.jpg)
* చిన్న చిత్రాల జోరు
కుమారి 21 ఎఫ్ వసూళ్లు కూడా పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్య పరిచాయి. యువతరం సినిమా అనే ముద్ర పడడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. రూ.3 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.12 కోట్లు దక్కించుకొంది. రాజుగారి గదికీ రెట్టింపు లాభాలొచ్చాయి. సినిమా చూపిస్త మావ రూ.10 కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో ఈ యేడాది చిన్న చిత్రాల విజయంగా మారిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



