ప్రియాంకకి కోపం వచ్చింది
on Dec 23, 2015

నిర్భయ కేసులో బాల నేరస్తుడి విడుదలకు తాను మద్దతు ఇవ్వనని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చెప్పింది. బాల నేరస్తుడు చేసిన పని క్షమించరానిదని, అతను విడుదల కావడం సరైన పని అని తాను భావించడం లేదని ఆమె స్పష్టం చేసింది. ప్రియాంక నటించిన ‘బాజీరావు మస్తానీ’ ఈమధ్యే విడుదలైన విషయం తెలిసిందే. ఈమె నెక్స్ట్ మూవీ ‘జై గంగాజల్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక నిర్భయ కేసు మీద తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేసింది. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, చట్టాలకు కట్టుబడి వుంటానని, అయితే నిర్భయ ఘటనలో బాల నేరస్తుడి పాత్ర చాలా దుర్మార్గమైనదని, నామమాత్రపు శిక్షతో అతన్ని స్వేచ్ఛగా వదిలేయడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



