కర్ణాటకలోనూ పోస్ట్ ప్రొడక్షన్‌కి గ్రీన్ సిగ్నల్
on May 12, 2020
తమిళనాడులో ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్‌కి 10 నుండి 15 మందికి మించకుండా... ఎడిటింగ్, రీ రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్, డిజైనింగ్, డీఐ పనులకు ఐదు మంది మించకుండా చూసుకోవాలని చెప్పింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ ఇండోర్ సెట్స్ లో టీవీ షూటింగులకు కన్నడ సర్కార్ కొన్ని రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇవ్వడంతో సినిమా ప్రముఖులకు ఊరట లభించినట్టు అయింది. చాలామంది పనులు మొదలు పెట్టారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే... మెజార్టీ ఇండస్ట్రీ పనులు హైదరాబాద్ సిటీలో జరుగుతాయి. ఇక్కడి తెలంగాణ సర్కార్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుండడంతో ఆలోచించి ముందడుగు వేయాలని అనుకుంటోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
