Home

»

Latest News

తమిళనాడు సీఎం విజయ్‌కు తీరని విషాదం.. కుటుంబంలో పెద్ద వ్యక్తి మృతి

Oct 31, 2026 2:55PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (92) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్యే అమల్ రాజశేఖరన్. వయసు మీద పడటంతో పాటు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

అమల్ రాజశేఖరన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో ఆమె వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్నారు. 92 ఏళ్ల వయసులో ఆమె మరణవార్త విజయ్ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

అమల్ రాజశేఖరన్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, పలువురు మంత్రులు నివాళులర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు అంతిమ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

 

 

[Tamil Nadu CM Vijay, Vijay Family News, Amal Rajasekaran, Vijay Aunt Death, Thalapathy Vijay News, Tamil Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com