బ్రేకప్.. విజయ్‌వర్మ, తమన్నా లవ్ జర్నీ ముగిసిందా?
on Mar 29, 2025
సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్.. పెళ్లి, విడాకులు.. ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో వారికే తెలీదు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో హీరోకి, హీరోయిన్‌కి లెక్కకు మించిన లవ్ స్టోరీలు ఉంటాయి. అవన్నీ తమ జీవితంలో కామన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. తాజాగా విజయ్‌వర్మ, తమన్నా జంటపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. రెండేళ్ళుగా రిలేషన్‌లో ఉన్న ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం, వివిధ వేడుకల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారిద్దరూ. కానీ, ఇటీవల వీరి బంధానికి బీటలు వారాయా? అనే అనుమానం అందరికీ కలుగుతోంది.
సినిమా రంగంలోని ఇలాంటి రిలేషన్‌షిప్‌ల విషయంలో చిన్న తేడా వచ్చిన ఆ లవర్స్ కంటే ముందు నెటిజన్లు పసిగట్టేస్తారు. విజయ్‌వర్మ, తమన్నాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లే విజయ్, తమన్నా ఈమధ్యకాలంలో చాలా ఈవెంట్స్‌కి విడివిడిగానే హాజరయ్యారు. దీంతో వీరి లవ్‌కి ఎండ్ కార్డ్ పడ్డట్టేనని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై విజయ్‌వర్మ స్పందిస్తూ ‘రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలి. ఒక ఐస్‌క్రీమ్ చివరి వరకు ఎలా ఆస్వాదిస్తామో అలా జీవితంలో వచ్చే ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గానే తీసుకోవాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది’ అంటూ ఓ సూక్తి చెప్పాడు. ఇక తమన్నా కూడా బ్రేకప్‌పై స్పందించింది. ‘రిలేషన్ షిప్‌లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. ప్రేమను వ్యాపారంలా చూడకూడదు. అలా చేస్తే తప్పకుండా సమస్యలు వస్తాయి. అందుకే భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేసింది. ఈ రెండు ట్వీట్స్‌ను గమనిస్తే.. ఇద్దరూ తమ లవ్‌కి గుడ్‌బై చెప్పుకున్నారన్న విషయం అర్థమవుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
