నువ్వే నా ప్రాణం..శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ప్రేమ అధికారకంగా పోస్టర్ తో రిలీజ్
on Mar 29, 2025
పుష్ప 2(Pushpa 2)లోని కిస్సిక్ సాంగ్ తో నేషనల్ వైడ్ గా స్టార్ స్టేటస్ ని పొందిన భామ శ్రీలీల(Sreeleela).స్టార్ స్టేటస్ ని పొందటమే కాదు,బాలీవుడ్ లోకి హీరోయిన్ గా కూడా లాంచ్ అవుతుంది.చందు ఛాంపియన్,భూల్ భూలయ్య 3 లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న'కార్తీక్ ఆర్యన్'(Kartik Aaryan)ఆ చిత్ర హీరో.లెజండ్రీ డైరెక్టర్ అనురాగ్ బసు(Anurag basu)దర్శకత్వం వహిస్తున్నాడు.దీంతో మొదటి చిత్రంతోనే శ్రీలీల బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందేనని చెప్పవచ్చు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి చిత్ర బృందం రీసెంట్ గా ఒక పిక్ ని రిలీజ్ చేసింది.'నువ్వే నా ప్రాణం' అనే కొటేషన్ తో విడుదల చేసిన ఆ పిక్ లో కార్తీక్,శ్రీలీల ఒక టీ తోటలో ప్రేమలో మునిగిపోయిన జంటలాగాఎదురెదురుగా కూర్చున్నారు.కార్తీక్ ఆర్యన్ మాత్రం శ్రీలీల కళ్ళలోకి చూస్తుండగా శ్రీలీల మాత్రం కార్తీక్ పై అలిగినట్టుగా మౌనంగా కిందకి తలవంచుకొని కూర్చుంది.ఆ ఇద్దరి పక్కనే రెండు 'టీ' గ్లాస్ లు ఉండగా వాటిల్లో 'టీ' ఫుల్ గా ఉంది.సోషల్ మీడియాలో పలువురిని ఆకర్షిస్తున్న ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజెన్స్ తో పాటు ఫ్యాన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఈ మూవీలో కార్తీక్ సింగర్ గా కనిపిస్తున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్(T siris)నిర్మిస్తుండగా దీపావళికి విడుదల చెయ్యాలనే ప్లాన్ తో మేకర్స్ ఉన్నారు.
గతంలో శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి.ఇందుకు బలం చేకూర్చేలా కార్తీక్ ఇంటికి శ్రీలీల వెళ్లడం,కార్తీక్ తల్లి ఒక కార్యక్రమంలో మాట్లాడుతు మాకు డాక్టర్ చదివిన కోడలు ఇంటికి రావాలని చెప్పడం జరిగింది.దీంతో శ్రీలీల, కార్తీక్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలకి మరింత బలం చేకూరినట్టయ్యింది. ఎందుకంటే శ్రీలీల ఎమ్ బిబిఎస్ చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో కార్తీక్,శ్రీలీల చేస్తున్న మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. శ్రీలీల రీసెంట్ గా తెలుగు నాట నితిన్ తో కలిసి చేసిన రాబిన్ హుడ్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
