తమన్నా కొత్త ఖాతా తెరిచింది..!
on Jun 8, 2016
మిల్కీ బ్యూటీ కొత్త ఎకౌంట్ ఓపెన్ చేసింది. అందరూ తనను ఫాలో అవ్వాలని కోరుతోంది. ఆల్రెడీ ఈ సుందరికి ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలున్నాయి. కొత్తగా స్నాప్ చాట్ లో చేరిందీ మిల్కీ భామ. ఇకనుంచీ తన విశేషాలన్నీ స్నాప్ చాట్ లో కూడా పంచుకుంటానని, అవి తెలుసుకోవాలంటే ఫాలో మీ ఇమ్మీడియట్లీ అంటోంది. సెలబ్రిటీలు తమ విశేషాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో తెలిసిందే. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల తర్వాత ఇప్పుడు స్నాప్ చాట్ సెలబ్రిటీలకు మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది. ఇదే అలవాటుగా స్నాప్ చాట్ లో తన ఫిట్ నెస్ సీక్రెట్స్ ను కూడా అభిమానులకు చెబుతోంది. రీసెంట్ గా తన ట్రైన ర్ సిద్ధార్ధ సింగ్ తో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది తమ్మూ. స్నాప్ చాట్ ద్వారా పప్పీ ఫేస్ లు పెడుతూ అభిమానులను టీజ్ చేస్తోంది. ప్రస్తుతం మాత్రం బాహుబలి 2 కోసం గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటోందీ మిల్కీ బ్యూటీ.