మెగాస్టార్ సినిమాకు స్పెషల్ గా భారీ సెట్..!
on Jun 8, 2016
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా, పైగా ల్యాండ్ మార్క్ 150, ఇన్ని విశేషాలున్న కత్తిలాంటోడు సినిమాకు ప్రొడ్యూసర్ చరణ్ అన్నీ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ సినిమా అంటూ ఎలాగూ ఉండే అంచనాల్ని, మూవీ టీం రోజురోజుకూ పెంచే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, భారీ సెట్ల కళాదర్శకుడు తోటతరణితో కొన్ని సీన్ల కోసం స్పెషల్ జైల్ సెట్ వేయిస్తున్నారు. మూవీలో చిరు జైల్లో ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాలు, అక్కడి నుంచి తప్పించుకునే సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తారు. ప్రస్తుతం ఈ సెట్ ఏర్పాట్లలో మూవీ టీం హడావిడిగా ఉంది. చిరు ఖైదీగా జైలు నుంచి పారిపోయే సన్నివేశం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. తోట తరణి నిజమైన జైలులా అనిపించే సెట్ ను నిర్మించారట. సినిమాలో చిరు రెండు పాత్రల్ని పోషిస్తుండగా, అందులో ఒకటి దొంగ పాత్ర. ఇంకొకటి బుద్ధిమంతుడి పాత్ర. చిరు సరసన బాలీవుడ్ భామ దీపిక పడుకొణే ను తీసుకున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.