ట్రైలర్ రివ్యూ: అభినేత్రి
on Sep 26, 2016

తమన్నా తన కెరీర్‌లోనే తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.. అదే అభినేత్రి. ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే హారర్ కామెడీ జోనర్‌లో సాగే సినిమా అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తమన్నా పాత్ర రెండు రకాలుగా ఉండబోతోంది. పల్లెటూరు పిల్లగా రూబీ అనే కథానాయికగా తన పాత్రలో రెండు పార్శ్వాలుంటాయి. సోనూసూద్‌కీ మంచి పాత్ర పడినట్టే అనిపిస్తోంది. ఇంత వరకూ విలనిజం పంచిపెట్టిన సోనూ.. తొలి సారి రొమాంటిక్‌పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభుదేవా, తమన్నా స్టెప్పులు ట్రైలర్‌కు సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చాయి.
అయితే... టీజర్ కట్ చేసినంత ఎఫెక్టీవ్ గా ట్రైలర్ కట్ చేయలేదేమో అనిపిస్తోంది. ఇది వరకు వచ్చిన ప్రభుదేవా, తమన్నాల డాన్సింగ్ టీజర్లే ఈ ట్రైలర్ కంటే బాగున్నాయనిపిస్తోంది. సప్తగిరి, ఫృద్వీ కామెడీ పంచ్ లు అంతగా వర్కవుట్ అవ్వలేదు. మరి సినిమాలో ఎలా ఉండబోతున్నాయో? సాజిద్ వాజీద్ ఇచ్చిన ఆర్.ఆర్ అదిరిపోయింది గానీ.. ట్యూన్లు మాత్రం క్యాచీగా లేవు. ఈ లోపాల్ని అధిగమించాలంటే తమన్నా తన గ్లామర్‌తో నటనతో ఈ సినిమాని కాపాడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



