ట్రైలర్ రివ్యూ : ఈడు గోల్డ్ ఎహె
on Sep 26, 2016

మొన్నే జక్కన్నగా ముస్తాబై వచ్చాడు సునీల్. అయితే ఆ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు సునీల్ ఆశలన్నీ ఈడు గోల్డ్ ఎహెపైనే ఉన్నాయి. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈలోగా... ట్రైలర్ బయటకు వచ్చింది. సునీల్ సినిమాకి తగ్గ కొలతలతో ఈసినిమా సాగిందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. `నాకు గాలి తగలకూడదు గానీ.. చల్లగా ఉండాలి, కాఫీ తెచ్చావేంట్రా నేనడిగింది కాఫీ` అంటూ వెరైటీ డైలాగులతో ట్రైలర్ మొదలైంది. ఆఖర్లో పోసారి వేసిన పంచ్ లైన్ అదిరింది.
చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఒకే కార్లోనా?? అంటూ పోసాని బీభత్సమైన పంచ్ వేశాడు. ఈ రెండూ పక్కన పెడితే.. మధ్య నడిపిన మసాలా అంతా మామూలుగానే ఉంది. ఓ కమర్షియల్ హీరోకి కావల్సిన సెటప్ ఈసినిమాలో కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే సునీల్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది. సునీల్ నుంచి జనం ఆశించేది కామెడీ. అది ట్రైలర్లోనే లేకపోతే ఇక సినిమాలో ఏం ఉంఉటంది? ట్రైలర్లో జోకులు పేల్చేస్తే.. ఇక సినిమాలో చూపించడానికి ఏం ఉండదని దాచేసుకొన్నారేమో?? ఈడు గోల్డెహె సినిమా హిట్టవ్వాలంటే తెరపై సునీల్ బీభత్సమైన కామెడీ చేయాల్సిందే. మరి వీరూపోట్ల ఏం మంత్రం వేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



