Home

»

Latest News

Tabu: మా ఇంట్లో అద్దం ఉంది.. మేటర్ మొత్తం మాకు తెలుసు 

May 14, 2026 12:17PM

 


మూడు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తున్న టబు ఇటీవల నాగార్జున(Nagarjuna)వందవ చిత్రంలో కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో  అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న 'వయసు' పరమైన వివక్ష, మహిళల వయసు గురించి సమాజానికి ఉన్న అతి ఉత్సాహంపై సెటైర్లు వేశారుపై టబు మాట్లాడటం జరిగింది.  


హార్పర్స్ బజార్ ఇండియా (Harper's Bazaar India) కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ 'మీ వయసు గురించి మీకన్నా ఎదుటివారికే ఎక్కువ ఆందోళన ఉంటుంది. మీ ఇంట్లో అద్దం లేనట్లుగా, వారే మీకు అద్దం చూపించి వయసు అయిపోతుందని గుర్తు చేయాలని చూస్తుంటారు. వయసు పెరగడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు.  ప్రతిరోజూ జరిగే ఒక సహజ ప్రక్రియ. ఒకరోజు ఉదయం 20 ఏళ్లు ఉండి, మరుసటి రోజుకే 45 ఏళ్లు అయిపోవు కదా.


Also read: Veerabhadrudu: ఇన్ని కోట్లు చెల్లిస్తే రిలీజ్ అంట! 


హీరోలకి వయసు పెరుగుతున్నా వారిని ఆదరించే పరిశ్రమ, హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. టబు చెప్పిన ఈ  తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com