Home

»

Latest News

Veerabhadrudu: ఇన్ని కోట్లు చెల్లిస్తే రిలీజ్ అంట! 

May 14, 2026 11:48AM

 

సూర్య(Suriya)వన్ మాన్ షో వీరభద్రుడు(Veerabhadrudu)ఈ రోజు మార్నింగ్ షో రద్దైన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉదయం 9 గంటల షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో వేల సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకున్నారు. తీరా షోలు క్యాన్సిల్ అని తెలియడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ నుండి కూడా షోలు కనుమరుగవ్వడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా అభిమానులు ధైర్యంగా ఉండాలని, సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


వీరభద్రుడు థియేటర్స్ లోకి రాకపోవడానికి ఆర్ధిక కారణాలు అని సుమారు 50 కోట్ల రూపాయలు చెల్లిస్తే సినిమా బయటకి వస్తుందని అంటున్నారు. దీంతో ఈ  రోజు కూడా రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు. ఒక స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  


Also read: Vijay: సీఎం విజయ్ సపోర్ట్ జాసన్ విజయ్ కి ఉంటుందా!.. సందీప్ కిషన్ మూవీ ఏమైంది 
 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com