
తమిళ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన హీరోగా నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇంతకాలం ఆయన సినిమాలకు తెలుగులో ఇతరులు డబ్బింగ్ చెప్పారు. కానీ ఇప్పుడు సూర్య తన లేటెస్ట్ మూవీ కోసం తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం.
'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసి సంచలన విజయాలను అందుకున్న సూర్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఆయన నటించిన 'ఎతర్‌క్కుమ్ తునిందవన్(ఈటీ)' మూవీ మార్చి 10న థియేటర్స్ లో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. 'ఈటి' పేరుతో ఏషియన్ సినిమాస్ ఈ మూవీని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. అయితే సూర్య తొలిసారిగా ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. తాజాగా సూర్య ఈ మూవీ తెలుగు డబ్బింగ్ ని పూర్తి చేశాడు.

కాగా, ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సందడి చేయనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.






