Home

»

Latest News

ర‌వితేజ 'ఖిలాడి' ఫ‌స్ట్ డే రిక‌వ‌రీ.. 22 శాతం!

Feb 12, 2022 4:07PM

 

ర‌వితేజ టైటిల్ రోల్ చేసిన 'ఖిలాడి' మూవీ ఫిబ్ర‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌మేశ్‌వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ర‌వితేజ న‌టించిన ఈ రెండో సినిమాలో డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌధ‌రి హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1600కు పైగా స్క్రీన్స్‌లో రిలీజైన ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకోలేక పోయిన ఈ సినిమాకు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే త‌క్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. తెలుగునాట 'ఖిలాడి' రూ. 4.30 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగాడు.

ఆంధ్రా ఏరియాలో రూ. 8.70 కోట్ల‌కు ఈ సినిమా అమ్ముడుపోగా తొలిరోజు ఈ ప్రాంతంలో వ‌చ్చిన షేర్ రూ. 1.88 కోట్లు మాత్ర‌మే. రాయ‌ల‌సీమ‌లో వ‌చ్చిన షేర్ రూ. 0.56 కోట్లు. ఇక్క‌డ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 2.80 కోట్లు. ఇక తెలంగాణ‌లో రూ. 8 కోట్ల విలువ‌కు గాను తొలిరోజు వ‌చ్చింది రూ. 1.86 కోట్లు. వెర‌సి శుక్ర‌వారం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.30 కోట్ల షేర్ వ‌చ్చింది. ఈ ప్రాంతాల్లో 'ఖిలాడి' ప్రి బిజినెస్ విలువ రూ. 19.50 కోట్లు. అంటే రిక‌వ‌ర్ అయ్యింది 22 శాత‌మే. 

ఏమాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ క‌థ‌నాల‌తో వ‌చ్చిన 'ఖిలాడి'లో ర‌వితేజ క్యారెక్ట‌ర్ కానీ, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ కానీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేయ‌లేక‌పోతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. విడుద‌లైన తొలి మూడు రోజుల్లో వ‌చ్చే క‌లెక్ష‌న్ల ఆధారంగా ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ రేంజ్‌లో నిలుస్తుందో ఓ అంచ‌నాకి రావ‌చ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com