సాహసానికి, మంచితనానికి మారుపేరు నటశేఖరుడు..!
on May 31, 2016
ఈ టైటిల్ ను ఎవరూ ఎప్పుడూ కాదనలేరు. ఇండస్ట్రీలో మంచితనమైనా, సాహసమైనా, స్పీడైనా సూపర్ స్టార్ కృష్ణకే చెల్లింది. నటనలో శిఖరం. సాహసంలో ప్రభంజనం. మంచితనంలో మంచు శిఖరం. తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దుకున్న ప్రతీ మలుపులోనూ కృష్ణ పేరు ఉంటుంది. తెలుగు సినీ చరిత్రతో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు, సూపర్ స్టార్ కృష్ణది కూడా అవిభక్త బంధం. అలాంటి మహామహుల స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చి, వాళ్లనే ఢికొట్టే స్థాయికి ఎదిగిన కష్ట జీవి నటశేఖరుడు. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఒకసారి సినిమాల్లో ఆయన చేసిన సాహసాలు చూద్దాం...
1. ఈనాడు - ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు.
2. అల్లూరి సీతారామరాజు - ఫస్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్
3. సింహాసనం - తొలి 70 ఎమ్ ఎమ్ ఫిల్మ్
4. తెలుగు వీర లేవరా - తొలి డిటిఎస్ ఫిల్మ్
5. మోసగాళ్లకు మోసగాడు - తొలి కౌబాయ్ ఫిల్మ్
6. గూఢచారి 116 - తొలి జేమ్స్ బాండ్ సినిమా
కేవలం ఇవి మాత్రమే కాదు. పదిహేడు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాక, డ్యూయల్ రోల్ ను 25 సార్లు, ట్రిపుల్ రోల్ ను 7 సార్లు వేసిన రికార్డు నటశేఖరుడిదే. ఒకే ఏడాది 18 సినిమాల్లో నటించిన ఘనత ఎప్పటికీ బ్రేక్ చేయలేని ఆయన రికార్డ్. నటశేఖరుడు మరిన్ని వసంతాల్ని ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుందాం.