రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?
on Oct 1, 2024
సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో సోమవారం ఉదయం ఆయన్ని చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రజినీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్స్ రజినీ హెల్త్ బులెటిన్‌ని విడుదల చేసింది.
ఆ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ‘గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో వాపు వచ్చింది. దానికోసం సర్జరీ అవసరంలేని మెథడ్ ద్వారా చికిత్స అందించాం. కార్డియాలజిస్ట్ డా.సాయిసతీష్ ఆధ్వర్యంలో ఒక స్టంట్‌ని అమర్చారు. దీని ద్వారా రక్తనాళాలకు వచ్చిన వాపు పూర్తిగా తగ్గిపోయింది. రజినీకాంత్‌గారి శ్రేయోభిలాషులు, అభిమానులకు మేం చెప్పేదేమిటంటే.. మేము అనుకున్న ప్రకారం సరైన వైద్యాన్ని అందించాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తాం’ అని ఆ బులెటిన్ ద్వారా తెలిపారు.
Also Read