మారిన 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!
on Oct 1, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుందని కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 25 కి మారిందని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి డిసెంబర్ 20 అనేది మంచి డేట్. ఫస్ట్ వీకెండ్ ఎలాగూ స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత క్రిస్మస్ హాలిడే, సెకండ్ వీకెండ్, న్యూ ఇయర్ హాలిడేతో పాటు.. సంక్రాంతి వరకు లాంగ్ రన్ కి మంచి స్కోప్ ఉంది. కానీ, ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా, డిసెంబర్ 25న విడుదల చేయడం వల్ల లాంగ్ రన్ పై ప్రభావం పడే అవకాశముంది. ఎందుకంటే, సినిమా విడుదలైన రెండు వారాలకే సంక్రాంతి సీజన్ మొదలై కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. దాంతో 'గేమ్ ఛేంజర్' వసూళ్లకు గండి పడుతుంది. అదే డిసెంబర్ 20న విడుదల చేస్తే.. ఐదు రోజుల అదనంగా కలిసొస్తాయి. అందుకే డిసెంబర్ 20 నే విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read