మహేష్ కొడుకుపై అది రూమరేనా??
on Aug 17, 2016

మహేష్ బాబు తనయుడు గౌతమ్ లోనూ ఓ నటుడు ఉన్నాడన్న సంగతి తెలిసిందే. గౌతమ్‌కీ యాక్టింగ్ అంటే పిచ్చి. మొన్నోసారి పోకిరిలో మహేష్ డైలాగుల్ని డబ్‌స్మాష్లో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వన్ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించాడు. ఇప్పుడు గౌతమ్ ఓ పూర్తి స్థాయి చిత్రంలో నటిస్తున్నాడన్న టాక్ బయటకు వచ్చింది. కృష్ణ కెరీర్‌లో మరపురాని చిత్రంగా మిగిలిపోయింది అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాకి సిక్వెల్‌రాబోతోందని...చిన్నప్పటి సీతారామరాజుగా గౌతమ్ కనిపిస్తాడని, ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని చెప్పుకొంటున్నారు.
మహేష్, నమ్రతలు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, నక్షత్రం పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. అయితే... ఇదంతా రూమరే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గౌతమ్‌కి నటించాలని వున్నా.. మహేష్‌కి ఇష్టం లేదని, గౌతమ్ చదువు పాడైపోతుందని మహేష్ భయపడుతున్నానని, ఇప్పుడే తనపై సినిమాల్ని రుద్దే ఉద్దేశం మహేష్‌కు లేదని తెలుస్తోంది. ఇది వరకు ఇలాంటి ఆఫర్లు గౌతమ్‌కి చాలా వచ్చాయని అయితే మహేష్ నో చెప్పాడని.. ఇప్పుడూ అంతేనని మహేష్ క్లోజ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త. సో.. అల్లూరి సీతారామరాజు సిక్వెల్ లేనట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



