అమ్మో బ్రహ్మీ... నరకం చూపిస్తున్నాడు
on Aug 17, 2016
స్టార్ కమెడియన్ బ్రహ్మానందానికి గడ్డు రోజులు ఎప్పుడో మొదలైపోయాయి. బ్రహ్మీ ఉంటే సినిమా ఫ్లాప్ అనే యాంటీ సెంటిమెంట్ ఆయన్ని వేధిస్తోంది. దానికి తోడు... బ్రహ్మీ కామెడీలోనూ పస లేకుండా పోతుంది. ఫృథ్వీలాంటి వాళ్లు... బ్రహ్మానందానికి పోటీగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మానందం యాటిట్యూడ్ కూడా ఏమాత్రం బాలేదని టాక్. సెట్లో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.... యూనిట్‌కి నరకం చూపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ తో నటిస్తున్న శభాష్ నాయుడు సెట్లోనూ ఇదే జరిగిందట. గత నెలలో శభాష్ నాయుడు షూటింగ్ అమెరికాలో జరిగింది. పదిహేను రోజుల పాటు బ్రహ్మానందం ఇతర కీలక పాత్రధారులపై అక్కడ సన్నివేశాలు తెరకెక్కించారు.
బ్రహ్మీ నుంచి కావల్సినంత కామెడీ పిండుకుందాం అని చూస్తే.. వాళ్లతో కన్నీళ్లు తెప్పించాడట బ్రహ్మీ. సెట్లో తనకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వలేదని గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయట. అలిగి సెట్లోంచి వెళ్లిపోయి... నరకం చూపించాడట. ఈ విషయం కమల్‌హాసన్ వరకూ వెళ్లిందని.. కానీ బ్రహ్మానందంపై ఉన్న గౌరవంతో ఏమీ అనలేదని తెలుస్తోంది. ఓవైపు సినిమా అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో.. అణిగిమణిగి ఉండడం పోయి ఇలా రెచ్చిపోవడం బ్రహ్మీ కెరీర్‌పై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకొంటాడో ఏంటో??