సన్నీలియోన్ విమానం మిస్సింగ్..!
on Jun 1, 2017
.jpg)
బాలీవుడ్ సెక్సీబాంబ్, సినీ నటి సన్నీలియోన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తన భర్త డేనియల్ వెబర్ మరికొందరు స్నేహితులతో కలిసి నిన్న ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తుండగా వారి విమానం ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలెట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో దించాడు. ఈ విషయాన్ని సన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. " విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం..మేం ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించక ప్రమాదానికి గురికాబోయింది..మమ్మల్ని కాపాడినందుకు దేవుడికి ధన్యవాదాలు...ముఖ్యంగా పైలట్ సమయస్పూర్తి, అత్యుత్తమ నైపుణ్యం కలవారని, వారి చేతుల్లో ఉన్న మా ప్రాణాలను కాపాడినందుకు రుణపడి ఉంటామని సన్నీ తెలిపారు. మరోవైపు సన్నీలియోన్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైందని ఆమె అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



