గీతకు, మల్లారెడ్డికి సుమ వీణ గిఫ్ట్ గా ఇస్తే ఏం చేస్తారో తెలుసా?
on Oct 20, 2022

పండగ వస్తోందంటే చాలు స్వీట్స్, చాక్లెట్స్, గిఫ్ట్స్ అబ్బో బోల్డన్ని మనకు వస్తాయి మనం కూడా ఆత్మీయులకు ఇస్తూ ఉంటాం. మరి త్వరలో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ సందర్భంగా యాంకర్ సుమ తన స్టాఫ్ కి స్వీట్ బాక్స్ గిఫ్ట్స్ గా ఇచ్చేసింది. అలాగే తన దగ్గర ఉన్న వీణను బయటకి తీసి "వరవీణ" అంటూ అద్భుతంగా వాయించి అందరిని మైమరిపించింది. "మీలో ఏదన్న టాలెంట్ ఉంటే అప్పుడప్పుడన్న దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది రిలాక్సేషన్ వస్తుంది మీ టాలెంట్ అందరికీ తెలుస్తుంది" అంది సుమ. "ప్రాక్టీస్ మేక్స్ ఆ మాన్ అండ్ వుమన్ పర్ఫెక్ట్ " అనే ఒక కొటేషన్ కూడా చెప్పేసింది.
తర్వాత తన దగ్గర ఉండే గీత అనే స్టాఫ్ ని పిలిచి "గీతా నీకు నా వీణను గిఫ్ట్ గా ఇస్తే ఏం చేస్తావ్ ? " అని అడిగింది సుమ వెంటనే గీత తన చీర కొంగుతో ఆ వీణను తుడిచేసింది. "ఓహో వీణ ఇస్తే ఇలా తుడుచుకుంటావ్ " అన్నమాట అంది.. ఇక హెయిర్ డ్రెస్సర్ మల్లారెడ్డిని పిలిచి "వీణను గిఫ్ట్ గా ఇస్తే ఏం చేస్తావ్" అని అడిగేసరికి వెంటనే అతను ఆమె తలను చక్కగా దువ్వి చూపించాడు..అంటే "నాకే హెయిర్ డ్రెస్సింగ్ చేసి నాతోనే వీణ వాయిస్తావా" అంటూ ఫన్ చేసింది. ఇక తర్వాత గీత, హెయిర్ డ్రెస్సర్ మల్లారెడ్డి, ఇంట్లో అన్ని చక్కబెట్టే వరుణ్, డ్రైవర్ హరి, మణికంఠ, తర్వాత ఇంట్లో పని చేసే వేణి, మని, సుభద్ర అందరినీ పిలిచి స్వీట్ బాక్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చేసింది. ఇలా ఈ దీపావళి పండగ సందర్భంగా సుమ తన స్టాఫ్ కి మిఠాయిలు పంచి అందరి నోటిని తీపి చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



