కొరటాల బాటలో సుకుమార్ కూడా వెళతాడా?
on Dec 14, 2021

`శ్రీమంతుడు` (2015), `జనతా గ్యారేజ్` (2016).. ఇలా విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మించడమే కాకుండా.. రెండు చిత్రాలతోనూ ఘనవిజయాలు అందుకుని వార్తల్లో నిలిచింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో `రంగస్థలం` (2018) తీసి హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అటుపై మరికొన్ని సినిమాలు చేసినా.. మరే దర్శకుడితోనూ రెండేసి సినిమాలు నిర్మించలేదు ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్.
Also read:అన్ని భాషల్లోనూ బన్నీ నోట అదే మాట..
కట్ చేస్తే.. ఇప్పుడు సుకుమార్ కాంబినేషన్ లోనే `పుష్ప - ద రైజ్`ని నిర్మించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తొలి పాన్ - ఇండియా మూవీగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డిసెంబర్ 17న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సందడి చేయనుంది. విశేషమేమిటంటే.. కొరటాల తరహాలో సుకుమార్ కూడా తన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ (రంగస్థలం, పుష్ప - ద రైజ్) మైత్రీ సంస్థలోనే చేశాడు. మరి.. కొరటాల బాటలోనే వెళ్ళి సుకుమార్ కూడా మైత్రీ సంస్థ సమేతంగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



