Home

»

Latest News

`ఎఫ్ 3`లో మెయిన్ విల‌న్ గా `అఖండ‌` ఫైట్ మాస్ట‌ర్!

Dec 6, 2021 9:43AM

`అఖండ‌`.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేష‌న్. ఈ సినిమా  ఘ‌న‌విజ‌యంలో యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి రామ్ - ల‌క్ష్మణ్, స్టంట్ శివ తో పాటు శివ త‌న‌యులు కెవిన్, స్టెవిన్ కూడా పోరాటాలు స‌మ‌కూర్చారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చాక వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ అన్నింటిని శివ అండ్ స‌న్స్ రూపొందించారు. దాదాపు 80 రోజుల పాటు ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని చిత్రీక‌రించార‌ట‌. ఇక బాల‌య్య న‌టించిన `ల‌క్ష్మీ న‌ర‌సింహా`, `విజ‌యేంద్ర‌వ‌ర్మ‌`, `సింహా` చిత్రాల‌కు కూడా గ‌తంలో స్టంట్ శివ ఫైట్ మాస్ట‌ర్ గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు శివ  స్టంట్స్ స‌మ‌కూర్చుతున్నారు.

వెంకీతో గీతా ఆర్ట్స్ 'డ్రైవింగ్ లైసెన్స్‌'!

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన `క్రాక్`లో యాక్ట‌ర్ గానూ అల‌రించారు స్టంట్ శివ‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో మెయిన్ విల‌న్ గా న‌టిస్తున్నారాయ‌న‌. ఆ చిత్ర‌మే.. `ఎఫ్ 3`. 2019 నాటి సంక్రాంతి సంచ‌ల‌నం `ఎఫ్ 2`కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న `ఎఫ్ 3` వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న తెర‌పైకి రానుంది. మ‌రి.. `ఎఫ్ 3` త‌రువాత మ‌రిన్ని చిత్రాల్లో శివ విల‌న్ గా అల‌రిస్తారేమో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com